ఇల్లీగల్ కార్ స్ట్రంట్స్ - ముగ్గురి అరెస్ట్
- September 12, 2016
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారులు, ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురూ రోడ్లపై ప్రమాదకర స్థితిలో స్టంట్స్ చేస్తూ, దాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియో ఆధారంగా ఆ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. హమాద్ టౌన్లో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అయిన వీడియో ట్రాఫిక్ అధికారుల దృష్టిలో పడింది. ఇంకో వైపున ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అల్ లుజిలోని రెసిడెన్షియల్ ఏరియా ప్రాంతంలో ఈ ముగ్గురు వ్యక్తులు కారులో ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. ఇలాంటి స్టంట్స్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, గత నెలలో జరిగిన ఓ ప్రమాదంలో 10మంది తీవ్రంగా గాయపడ్డ ఘటనతో ఈ తరహా స్టంట్స్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఇంకో వైపున బుకావాలో ఇద్దరు వ్యక్తులు ఇల్లీగల్ స్టంట్స్ చేస్తూ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.
తాజా వార్తలు
- అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు...హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- గురుదేవ సోషల్ సొసైటీ 93వ శివగిరి తీర్థయాత్ర..!!
- యూఏఈలో డస్టీ వెదర్..NCM సేఫ్టీ మెజర్స్ జారీ..!!
- కువైట్ లో కోల్డ్ వేవ్స్..మంచు కురిసే అవకాశం..!!
- రియాద్ పరిసర ప్రాంతాలలో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- జబల్ అఖ్దర్లో OMR9 మిలియన్లతో టూరిజం ప్రాజెక్టులు..!!
- ఇండోర్ ఫైర్, చార్కోల్ వినియోగం పై హెచ్చరికలు..!!







