బొప్పాయి పాయసం
- September 12, 2016
కావలసినవి: ముగ్గిన బొప్పాయిలు 2 కేజీలు, చక్కెర అరకేజీ, నీరు ఒకటిన్నర కప్పు, కొబ్బరికాయలు రెండు, యాలకులు 5, జీడిపపలు 15, కిస్‌మిస్ 10, నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు.
ఎలా చేయాలి
బొప్పాయి పళ్లను చెక్కు తీసి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక బాణలిలో వాటిని వేసి కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురిమి మూడు విడతలుగా పాలు తయారు చేయాలి. తురుము నుంచి మొదట ఒక కప్పు పాలు తీయాలి. ఆ పిప్పి నుంచి మళ్లీ మూడు కపలు పాలు తీయాలి. మరో సారి కూడా ఆ పిప్పి నుంచి మూడు కప్పుల పాలు తీయాలి. ఈ పాలను విడి విడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో నీళ్లు పోసి వేడి చేయాలి. లేత పాకం వచ్చాక బొప్పాయి పళ్ల గుజ్జును, చివర్లో తీసిన మూడు కపల కొబ్బరి పాలను వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత రెండో సారి తీసిన కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. కొద్ది నిమిషాల తర్వాత మొదట తీసిన ఒక కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి. యాలకులను పొడి చేసి చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి కిందికి దించాలి. నేతిలో వేగించిన జీడిపపలు, కిస్‌మిస్‌లతో అలంకరించాలి.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు!







