'ఎంఎస్ ధోని' 30న విడుదల ..
- September 12, 2016
భారత క్రికెట్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా, విజయవంతమైన కెప్టెన్‌గా, ఝార్ఖండ్ డైనమైట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎంఎస్ ధోని. ప్రస్తుతం ఆయన జీవితం ఆధారంగా హిందీలో తెరకెక్కుతున్న సినిమా 'ఎంఎస్ ధోని'. 'అన్ టోల్డ్ స్టోరీ' అన్నది టాగ్‌లైన్. ఈ చిత్రానికి నీరజ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్‌సింగ్ ఇందులో ధోనిగా నటిస్తున్నారు. కియారా అద్వాని, అనుపమ్ కౌర్, భూమికాచావ్లా, రాజేష్ శర్మ ఇతర తారాగణం. ప్రసుత్తం ఈ సినిమా తమిళంలో కూడా విడుదలవుతోంది. ధోనికి తమిళనాట పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందులోనూ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఆయనే సారథి కావడంతో..ఇక్కడి క్రీడాభిమానులకు ధోని అంటే 'మనోడే' అన్నంతగా అభిమానం చూపుతారు. అందుకే ఈ చిత్రంపై కోలీవుడ్‌లోనూ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. 150 పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.అదేవిధంగా చెన్నైలోని కొన్ని థియేటర్లలో హిందీలో కూడా విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి
తాజా వార్తలు
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ







