ఈద్‌ ఉత్సవాల వేళ చిన్న నిరాశ

- September 12, 2016 , by Maagulf
ఈద్‌ ఉత్సవాల వేళ చిన్న నిరాశ

అబుదబీ: యూఏఈలోని పలు కుటుంబాల్లో ఈద్‌ అల్‌ అదా సందర్భంగా చిన్న నిరాశ కనిపిస్తోంది. ఆయా కుటుంబాల్లోని కొందరు హజ్‌ యాత్రలో ఉండటంతో సంప్రదాయంగా ఉన్న కొన్ని సెంటిమెంట్లను పాటించలేకపోతున్నామని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే హజ్‌ యాత్ర ఎంతో పవిత్రమైనదని వారు చెబుతున్నారు. 'నా భర్త ఓ మంచి కార్యం కోసం మాకు దూరమయ్యారన్న విషయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఈద్‌ శుభ వేళ కుటుంబ పెద్ద లేకపోవడం కొంచెం బాధ కలిగిస్తోంది' అని భారతదేశానికి చెందిన 30 ఏళ్ళ షబ్నమ్‌ మొయిదీన్‌ చెప్పారు. ప్రతి సంవత్సరం ఈద్‌ అల్‌ అదా సెలబ్రేషన్స్‌, వార్షిక హజ్‌ యాత్రతో లింక్‌ చేయబడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా హజ్‌ యాత్రీకులు సౌదీ అరేబియాలోని మక్కాకి చేరుకుని పవిత్ర ప్రార్థనలు నిర్వహిస్తారు. యూఏఈలోని వలసదారులైన హజ్‌ యాత్రీకులు కుటుంబాలతో కలిసి హజ్‌ యాత్రకు వెళుతుంటారు. కుటుంబాన్ని వదిలి కుటుంబ పెద్దలు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు మాత్రం, తమవారి క్షేమం కోసం ఈద్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com