'ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్' పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
- September 13, 2016
ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్‌పై సినీ నిర్మాతలు, సినీ ప్రముఖులతో హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 24 నుంచి 27వరకు ఇండీవుడ్ కార్నివాల్ ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో పలు చిత్ర పరిశ్రమలు వస్తున్నందున పరస్పర సహకారానికి కార్నివాల్ ఉపయోగపడుతుందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కళాఖండం రామోజీ ఫిల్మ్‌సిటీ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలు బాగున్నాయని వివరించారు. ఇండీవుడ్ కార్నివాల్‌ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ని ‘మా’ కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యుడు శివాజీ, సినీ నిర్మాత సి.కల్యాణ్, పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







