భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని..
- September 13, 2016
కశ్మీర్ ఆందోళనల నేపథ్యంలో భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అదే ధోరణి బయటపెట్టారు. భారత్ నుంచి విడిపోయేందుకు కశ్మీర్ ప్రజలు చేస్తున్న త్యాగాలకు ఈ బక్రీద్ పండగను అంకితం చేస్తున్నానంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు.బక్రీద్ పర్వదినం సందర్భంగా రాయ్‌విండ్‌లోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి షరీఫ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 'కశ్మీరీ ప్రజల త్యాగాలను మేం మర్చిపోం. వారి త్యాగాలకు బక్రీద్ పండగను అంకితమిస్తున్నాం.వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. కశ్మీర్ ప్రజలఆశలు నెరవేరేదాకా మేం వారికి మద్దతిస్తూనే ఉంటాం' అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత్ నుంచి స్వేచ్ఛ పొందేందుకు కశ్మీర్ ప్రజలు వారి మూడో తరాన్ని త్యాగం చేశారని షరీఫ్ అన్నారు.హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుర్హాన్ వనీని స్వాంత్రంత్య సమరయోధుడిగా పాక్ పేర్కొంది. దీంతో భారత్, పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







