రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నఎయిర్ఏషియా..
- September 13, 2016
కావేరీ వివాదంతో కర్ణాటక అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పలు సాఫ్ట్వేర్ సంస్థలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విమానాల్లో వెళ్లాల్సినవారు ఎయిర్‌పోర్టుకు చేరుకోలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఏషియా తమ ప్రయాణికులకు కాస్త వూరట కలిగించింది. ఆందోళనల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.బెంగళూరు నుంచి ఎయిర్ఏషియా విమానాల్లో మంగళవారం వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆందోళనల దృష్ట్యా ఎయిర్‌పోర్టుకు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మంగళవారానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 72 గంటల్లోగా ఎప్పుడైనా వెళ్లొచ్చని ఎయిర్ఏషియా తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







