తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఆందోళనలకు దిగడం మంచిది కాదని: ప్రధాని

- September 13, 2016 , by Maagulf
తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఆందోళనలకు దిగడం మంచిది కాదని: ప్రధాని

కావేరి జలాల వివాదంపై కర్ణాటక రాజధాని బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమస్యలకు ఆందోళనలు పరిష్కారం కాదు.. శాంతంగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యం నెలకొనేలా చేయాలే కానీ.. ఇలా ఆందోళనలకు దిగడం మంచిది కాదని సూచించారు. కావేరి జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాలని సుప్రీంకోర్టు మరోమారు ఆదేశించడంతో కర్ణాటకలో ఆందోళనలు చెలరేగాయి. వీటి కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉమేశ్‌ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతడి కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com