నాని చిత్రంలో యంగ్ టైగర్ పాట..

- September 13, 2016 , by Maagulf
నాని చిత్రంలో యంగ్ టైగర్  పాట..

ఒక కొత్త సినిమాలో వెరైటీ జోడించేందుకు ఆ హీరో.. మరో హీరోతో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్పిస్తుంటారు కొంతమంది తెలుగు డైరెక్టర్లు. అలానే కొంతమంది హీరోలు తమ గొంతుతో వేరే హీరో కోసం పాటలు కూడా పాడుతుంటారు. 'జల్సా'కు మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు నాచురల్ హీరో నాని కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడని టాక్.'పక్కా లోకల్' చిత్రంలో యంగ్ టైగర్ ఓ పాట పాడుతున్నాడని ఫిల్మ్‌నగర్ న్యూస్. దీనికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్.. ఎన్టీఆర్‌తో ఒక పాట పాడిస్తే బావుంటుందని అన్నాడట. ఇందుకు ఈ చిత్ర నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్ త్రినాథరావు, హీరో నానితో డిస్కస్ చేయడంతో వాళ్ళు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటూ ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ సర్క్యులేట్ అవుతోందట.ఇటు ఎన్టీఆర్‌కీ నాని నటన అంటే ఇష్టమనీ, అందుకనే వేరేమాట లేకుండా వెంటనే ఓకే చేశాడని తెలుస్తోంది. ఇక ఒన్ బై ఒన్ హిట్స్‌తో దూసుకుపోతున్న నానికి ఎన్టీఆర్ పాట ఎస్సెట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారట డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com