'ఆధార్' తప్పనిసరి రైల్ టిక్కెట్ బుకింగ్‌కు..
- September 13, 2016
రైల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటారా? ఇక తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను జత చేయాల్సిందే. త్వరలోనే ఈ విధానం అమల్లోకి రాబోతోందని రైల్వే వర్గాలు తెలిపాయి. ట్రైన్ టికెట్లకు ఆధార్ వివరాలు అనుసంధానించేలా ఒక విధానాన్ని తీసుకు రావాలని రైల్వే శాఖ చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తుది విధానం మరో పదిహేను రోజుల్లో ఖరారు కానుందని తెలుస్తోంది. ఆ ప్రకారం కౌంటర్లు, ఆన్‌లైన్‌లో రిజర్వేషన్, అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లకు ఆధార్ వివరాలను ప్రయాణికులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందువల్ల భారీగా టిక్కెట్లను ముందుగానే బ్లాక్ చేసి పెట్టే దళారుల బెడద నివారించవచ్చని రైల్వే శాఖ యోచనగా ఉంది.అడ్వాన్స్‌గా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాలనుకునే వారికి దళారుల కారణంగా టిక్కెట్లు దొరకడం లేదు. ఈ సమస్యలపై దృష్టి సారించిన రైల్వే శాఖ ఆధార్‌ను జతచేయడం తప్పనిసరి చేస్తూ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







