ఖతార్‌లో మొబైల్ 'మాస్క్'లు
- September 13, 2016
దోహా: షేక్ ఈద్ బిన్ మొహమ్మద్ అల్ థని ఛారిటబుల్ అసోసియేషన్ - ఈద్ ఛారిటీ, ముస్లిం సోదరుల కోసం మొబైల్ మాస్క్‌లను అందుబాటులోకి తెచ్చింది. మాస్క్‌లు లేని చోట్ల ఈ మొబైల్ మాస్క్‌లు ముస్లిం సోదరులకు పవిత్ర భావనను అందజేస్తాయి. కొన్నేళ్ళ క్రితమే ఈ మొబైల్ మాస్క్‌లు అందుబాటులోకి వచ్చినా, వీటి పట్ల పెద్దగా అవగాహన లేదు. ప్రస్తుతం ఈ సర్వీసుని విస్తృతం చేశారు. ఎస్పైర్ జోన్, షెరటాన్ పార్క్, అల్ రయ్యాన్ పార్క్, సీలైన్ ఏరియా, సల్మాన్ జమాన్ అల్ కాహతాని వంటి ప్రాంతాలకు మొబైల్ మాస్క్ సేవల్ని విస్తరించినట్లు ఈద్ ఛారిటీ మేనేజర్ ఆఫ్ జనరల్ ప్రోగ్రామ్స్ వెల్లడించారు. ప్రతి వాహనంలోనూ ఓ మైక్రో ఫోన్ ఉంటుందనీ, ప్రేయర్ టైమ్‌ని వెల్లడించడానికి ఇది ఉపయోగపడుతుందని, అలాగే ట్యాప్‌ల ద్వారా నీటిని అందజేయడానికి సౌకర్యాలున్నాయనీ, టీవీ స్క్రీన్‌తోపాటు ప్రార్థన కోసం మ్యాట్లను కూడా వీటిల్లో అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈ వాహనంలో ఉండే వాలంటీర్లు, ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తారని వివరించారాయన. కేవలం ప్రార్థనల కోసం తప్ప, ఈ వాహనాల్ని ఇతర అవసరాల కోసం వినియోగించరు. షేక్ తని బిన్ అబ్దుల్లా ఫౌండేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ సర్వీస్ కూడా ఇలాంటి సర్వీసుల్ని ఓ వాహనాన్ని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







