జాబ్‌ ఓపెనింగ్స్‌ కోసం కువైట్‌లో 21,243 మంది వెయిటింగ్‌

- September 13, 2016 , by Maagulf
జాబ్‌ ఓపెనింగ్స్‌ కోసం కువైట్‌లో 21,243 మంది వెయిటింగ్‌

కువైట్‌: సివిల్‌ సర్వీస్‌ కమిషన్‌ (సిఎస్‌సి) తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం 21,243 మంది కువైటీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం గురువారం సాయంత్రం నాటికి ఎదురుచూస్తున్నట్లు తేలింది. అయితే 11,768 ఖాళీలు మాత్రమే వివిధ విభాగాల్లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం అప్లికెంట్స్‌లో వీరి సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే. 210,678 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ మరియు ఇతర రంగాల్లో 189,330 మంది ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఉద్యోగాల్ని సొంతం చేసుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. పబ్లిక్‌ సెక్టార్‌లో 11,185 పోస్ట్‌లకుగాను యూనివర్సిటీ డిగ్రీ, డిప్లమా మరియు సెకెండరీ ఎడ్యుకేషన్‌ (రెండేళ్ళ ట్రైనింగ్‌ కోర్స్‌తో) విద్యార్హతలుగా గుర్తించారు. మిగిలిన 583 స్లాట్స్‌ పిహెచ్‌డి, మాస్టర్స్‌ డిగ్రీ, సెకెండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌తో అర్హత కలిగి ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com