యెమెన్‌లో ముగ్గురు కతారీ సైనికుల మృతి
- September 13, 2016
యెమెన్‌లో షియా రెబల్స్, జిహాదీలతో జరుగుతున్న పోరాటంలో ముగ్గురు ఖతారీ సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద లాస్ అని అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్‌లో ఖతార్ సైనికుడొకరు యెమెన్‌లో శాంతి కోసం సంకీర్ణ దళాలు జరిపిన పోరాటంలో మృతి చెందారు. ఇప్పుడు ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖతార్, భద్రతా బలగాల్ని యెమెన్‌లో మోహరించింది. యుఎన్ వర్గాల లెక్కల ప్రకారం 6,500 మంది యెమెన్‌లో మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. యెమెన్‌లో శాంతి కోసం యూఎన్ ప్రతినిధి బృందం, అలాగే గల్ఫ్ రీజియన్‌కి చెందిన కూటమికి ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







