సాయి విలన్ గా ఎంట్రీ
- September 13, 2016
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడిగా, 143 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నటుడు సాయిరాం శంకర్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటుడు, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా.. స్టార్ ఇమేజ్ సాధించే స్ధాయి హిట్స్ మాత్రం రావటం లేదు. దీంతో తమ్ముడి కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు పూరి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, త్వరలో సాయిరాం శంకర్ కీలక పాత్రలో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమాలో సాయి హీరోగా కాదు, విలన్ గా నటించనున్నాడట. ఓ ప్రముఖ హీరో నటిస్తున్న ఈ సినిమాతో సాయిని నెగిటివ్ రోల్ లో పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే టాలీవుడ్ లో విలన్ రోల్స్ లో చేసిన చాలా మంది.. హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే బాటలో సాయి కూడా విలన్ గా ఎంట్రీ ఇచ్చి తిరిగి హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడు
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు
- సౌదీ అరేబియాలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష
- కువైట్ లో ఇల్లీగల్ ఫైర్ వర్క్స్ స్టాక్ సీజ్..!!
- ఒమన్ లో ఇకపై ప్రీ మారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరి..!!
- లుసైల్లో ఫైర్ వర్క్స్ ప్రదర్శనను వీక్షించిన 250,000 మంది పైగా ప్రజలు..!!
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…







