గుత్తి క్యాప్సికం

- September 13, 2016 , by Maagulf
గుత్తి క్యాప్సికం

కావలసిన పదార్థాలు: క్యాప్సికం (చిన్నవి) - 8, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - 1 టీ స్పూను.

కూరడానికి: టమోటాలు - 2, ఉల్లిపాయ - 1, క్యారెట్‌ - 1, బీన్స్‌ - 6, పచ్చిబఠాణి - గుప్పెడు, పనీర్‌ తురుము - 1 కప్పు, జీలకర్ర - 1 టీ స్పూను, అల్లం - అంగుళం ముక్క, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాల పొడి - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - అరకప్పు, గరం మసాల - 1 టీ స్పూను, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం : కూరగాయల్ని సన్నగా తరగాలి. క్యాప్సికం తొడిమలతో పాటు, గింజలు తీసి లోపలి భాగమంతా ఉప్పు కలిపిన నూనె రాసి ప్రీ - హీట్‌ చేసిన ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచి తీసెయ్యాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఉల్లి, టమోటా, అల్లం, బీన్స్‌, పచ్చిబఠాణి, క్యారెట్‌ ముక్కలు 3 నిమిషాలు వేగించాలి. తర్వాత కారం, పసుపు, గరంమసాల చేర్చి 2 నిమిషాల తర్వాత అరకప్పు నీరు కలిపి మూతపెట్టాలి. చిక్కబడ్డాక పనీర్‌ తురుము, కొత్తిమీర వేసి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికంలో కూరి ఒవెన్‌లో 5 నిమిషాలు ఉంచి తీసెయ్యాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com