కేన్సర్ కలిగే ఆశ్చర్యకర ప్రదేశాలు..

- September 13, 2016 , by Maagulf
కేన్సర్ కలిగే ఆశ్చర్యకర ప్రదేశాలు..

కేన్సర్ గురించి మీకు అన్ని విషయాలు తెలుసా? కొన్ని ప్రాంతాలలో కేన్సర్ కలుగుతుందని తెలిస్తే మీరు తప్పక ఆశ్చర్యానికి గురవుతారు.

కనురెప్పలు
మీకు తెలుసా, 5-10 శాతం వరకు కనురెప్పలలో కేన్సర్ కలిగే అవకాశం ఉంది అని. అవును, మీరు విన్నది నిజమే. నాన్- మేలనోమా రకం కేన్సర్ కలిగే అవకాశాలు ఎక్కువగా గల ప్రదేశంలో కనురెప్పలు కూడా ఒకటి. త్వరగా కేన్సర్ ను గుర్తించటం ద్వారా కేన్సర్ వ్యాప్తిని నిర్మూలించవచ్చు. కావున రోజు మీ కనురెప్పలను గమనించుకోండి.

పిరుదులు
పిరుదులు కూడా కేన్సర్ వ్యాధికి గురవవచ్చని ఎపుడైనా విన్నారా? అవును, పురుదుల మధ్యలో రాషేస్ వస్తే మాత్రం అశ్రద్ద వహించకండి. వెంటనే వైద్యుడిని కలిసి చెక్ చేపించుకోవటం వలన సమస్య మరింత తీవ్రతరం అవకుండా జాగ్రత్త పడవచ్చు.

కాలి వేళ్ళ మధ్య
ఎపుడైనా మీ కాలి వేళ్ళ మధ్యను పరిశీలించారా? మీ కాలి వేళ్ళ మధ్య చాలా కాలం నుండి ఎవైన సమస్యలు నయం కాకుండా ఉండటం గమనించారా? అయితే వెంటనే వైద్యుడిని కలిసి చెక్ చేపించుకోండి. ఈ ప్రదేశంలో కూడా కేన్సర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు.

అరికాళ్ళలో కేన్సర్
చర్మ కేన్సర్ శరీరంపై ఎక్కడైనా కలగవచ్చు, అరికాళ్ళలో కూడా ఏర్పడవచ్చు అని తెలిస్తే మీ ఆశ్చర్యానికి గురవవచ్చు. కేన్సర్ కలిగే అతి దారుణమైన ప్రదేశంగా చెప్పవచ్చు. అరికాళ్ళలో సంభవించే ఈ రకం మేలనోమా కేన్సర్ ను "ఆక్రల్ లెంటిజినస్ మేలనోమా" గా పేర్కొంటారు.

గోర్ల కింద
చర్మ కేన్సర్ గోళ్ల కింద కూడా వస్తుందని చాలా మందికి తెలియదు. కొన్ని సార్లు ఫంగస్ వలన కలిగిన ఇన్ఫెక్షన్ లను కొనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, గోళ్ల కింద ఏర్పడే అసాధారణ గడ్డలను అశ్రద్ద చేయకుండా వెంటనే చర్మ వ్యాధి నిపుణుడిని కలవటం మంచిది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com