భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి : హైదరాబాద్
- September 13, 2016
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగాజూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, మీయాపూర్, ఖైరతాబాద్, కోఠి, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయినాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులు జలమయమైనాయి. భారీ వర్షంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే మాదాపూర్ లో 5.5 సెం.మీ, షాపూర్ లో 3.2 సెం.మీ వర్ష పాతం నమోదయిందని జీహెచ్ ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గోల్కొండ, రాంచంద్రాపురం, అంబర్ పేటలో 3 సెం.మీ వర్షపాతం నమోద అయినట్లు చెప్పారు.భారీ వర్షాల కారణంగా ఎనిమిది చోట్ల చెట్లు విరిగిపడ్డాయని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా నాలాలు పొంగిపొర్లుతున్నాయన్నారు. నాలాలపై నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు వెంటనే ఖాళీ చేయాలని నగర వాసులకు జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







