అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు భారీ సైనిక సహకార ఒప్పందానికి వచ్చాయి.

- September 14, 2016 , by Maagulf
అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు భారీ సైనిక సహకార ఒప్పందానికి వచ్చాయి.

అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు భారీ సైనిక సహకార ఒప్పందానికి వచ్చాయి. దీని విలువ సుమారు 38 బిలియన్‌ డాలర్లని అంచనా. దీనికి సంబంధించిన ఒప్పందంపై బుధవారం సంతకాలు జరగనున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే పదేళ్లలో అమెరికా ఇజ్రాయెల్‌కు సైనిక సహకారం అందజేస్తుంది. ఈ డీల్‌ కోసం దాదాపు 10నెలలుగా చర్చలు జరుగుతున్నాయి.
అమెరికా ఏదైనా ఒక దేశానికి చేస్తున్న అతిపెద్ద సైనిక సాయం ఇదే. మరో పక్క ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ కూడా భారీ రాయితీలను ప్రకటించారు. దీనిలో భాగంగా ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ చీఫ్‌ జాకబ్‌ నగెల్‌ వాషింగ్టన్‌తో బేరసారాలు జరుపుతున్నారు.

మరోపక్క వైట్‌హౌస్‌ కూడా ఈ డీల్‌కు సంబంధించి కాంగ్రెస్‌ సభ్యులకు సమాచారం అందజేస్తోంది.
అమెరికా ఆధ్వర్యంలో ఇటీవల ఇరాన్‌తో అణుఒప్పందం జరగడం ఇజ్రాయెల్‌కు నచ్చలేదు. దీనిని నెతన్యాహూ తీవ్రంగా వ్యతిరేకించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com