సౌదీ జైల్‌లో 13 ఏళ్ళ శిక్ష అనంతరం ఇంటికి
- September 15, 2016
బహ్రెయిన్‌కి చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో 13 ఏళ్ళ జైలు జీవితం అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. తీవ్రవాద నేరారోపణల నేపథ్యంలో అబ్దుల్‌రహీమ్ అల్ ముర్బతి 2003, జూన్ 16న జైలుకు వెళ్ళాడు. గురువారం ఆయన బహ్రెయిన్‌కి చేరుకున్నట్లు స్థానిక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వెల్లడించారు. బహ్రెయిన్ హ్యూమన్ రైట్స్ వాచ్ సొసైటీ జనరల్ సెక్రెటరీ ఫైసల్ ఫులాద్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే సౌదీ అరేబియా, అల్ ముర్బతిని పూర్తిగా విడిచిపెట్టిందా? లేదంటే బహ్రెయిన్‌కి అప్పగించిందా? అనేదానిపై స్పష్టత లేదు. సౌదీ విధించిన శిక్ష ప్రకారం ఇంకో 15 ఏళ్ళ జైల్ టెర్మ్ ఆయనకు మిగిలే ఉంది. అయితే అల్ మర్బతి కుటుంబ సభ్యులు, ఎలాంటి ఆధారాలు లేకుండా అతన్ని సౌదీ ప్రభుత్వం జైల్లో ఉంచిందని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







