కొల్హాపురి మటన్‌

- September 15, 2016 , by Maagulf
కొల్హాపురి మటన్‌

కావలసినవి: మటన్‌- అరకిలో, టొమాటో ముక్కలు- ఒకటి, ఉల్లిపాయ తరిగినది- ఒకటి, కొబ్బరి తురిమినది - అరచిప్ప, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్‌లు, మిరియాలు- నాలుగు లేక ఐదుగసగసాలు    - రెండు టీ స్పూన్‌లు, ధనియాలు- రెండు టీ స్పూన్‌లు, పసుపు- ఒక టీ స్పూన్‌, గరమ్‌ మసాల పొడి- ఒక టీ స్పూన్‌, నూనె తగినంత.

తయారీ విధానం:
మటన్‌ని కడిగి శుభ్రం చేసి నీరు ఇగిరి పొడిగా అయిందాకా ఉడికించండి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి , టొమాటో ముక్కలు, మిరియాలు, ధనియాలు మెత్తగా రుబ్బి పెట్టుకోండి. మూకుడులో నూనె వేడి చేసి మసాలా వేసి 7 లేక 8 నిమిషాలు నూనె తేలిందాకా వేగించండి. తర్వాత ఉడికించిన మటన్‌ని వేసి మసాల దానికి బాగా పట్టేలా కలియబెట్టండి. తరువాత తురిమిన కొబ్బరి వేసి మటన్‌ మసాలాని పూర్తిగా పీల్చుకునే దాకా ఉడికించండి. ఒకవేళ బాగా పొడిగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా నీరు చిలకరించండి. పూర్తిగా ఉడికిన తరువాత తీసి పరాఠాలతో కానీ చపాతీతోగానీ వడ్డించండి. దాదాపు మన మటన్‌ ఇగురు కూరే ఇది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com