'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో చిరు
- September 16, 2016
బుల్లితెరపై రెండు సెషన్స్‌లో ఓ రేంజ్లో హంగామా చేసింది నాగార్జున హోస్ట్‌గా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం. రెండు సెషన్స్‌లో అదేజోరు.. టీఆర్పీ రేటింగ్‌లోనూ ఎదురులేకుండా పోయింది. మూడోసారి మాత్రం ఆడియన్స్ నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఆ ఛానెల్ కొత్త ప్రయోగం మొదలుపెట్టినట్టు సమాచారం. ఈసారి నాగ్ స్థానంలో హోస్ట్‌గా చిరంజీవిని తీసుకోవాలని భావించడం, ఈ విషయమై ఆయనతో మాట్లాడడం ఓకే చేయడం జరిగిపోయింది.మాటీవీలో డిసెంబర్ 12 నుంచి సోమవారం నుంచి గురువారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారం కానుందని సమాచారం. ఎట్ ప్రజెంట్ 150వ మూవీతో బిజీగావున్న మెగాస్టార్, చిత్రీకరణ 50శాతం పూర్తి అయ్యిందని, నవంబర్ చివరినాటికి షూటింగ్ ఫినిష్ చేయాలన్నది ఆయన ఆలోచన.ఆ తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో బిజీ కానున్నాడట. ఇదిలావుండగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులకు చిరు దూరమయ్యాడన్న ప్రచారం వుంది. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ దగ్గరకావచ్చునన్నది మెగా ఫ్యాన్స్‌లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి గెస్ట్‌గా చిరంజీవి హాజరైన విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







