మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై అధికారుల తనిఖీ

- September 16, 2016 , by Maagulf
మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై  అధికారుల తనిఖీ

కువైట్ సిటీ :  వివిధ మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై   ప్రచారం నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోఈద్ అల్- అధా ఉత్సవాల సమయంలో ఈ తనిఖీ కార్యక్రమం ప్రారంభించింది. యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల మేజర్ జనరల్ ఇబ్రహీం అల్ తర్రహ్  నేతృత్వంలో పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. అంతర్గత  మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో, ప్రజా సంబంధాలు  మరియు సెక్యూరిటీ మీడియా శాఖ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించినట్లు ప్రచారంలో వివరించారు. తమ తనిఖీలు  మార్కెట్లు , షాపింగ్ మాల్స్ మరియు వినోద మందిరాలలో శాంతిభద్రతలకి  తగిన భరోసా ఉండేలా చూడటమే తమ లక్ష్యం అని తెలిపారు. రాజధానితో సహా గవర్నరేట్ల పరిధిలో హవల్లి  మరియు ఫర్వాణీయలలో 360 దుకాణాలలో అవెన్యూస్ మాల్ మరియు సౌక్  షారుఖ్ ప్రధాన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది.  అందరూ పండుగ ఉత్సాహంలో  లో ఉన్నారని అయితే, ఆయా ప్రాంతాలలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా సంరక్షించుకోవాలని అధికారులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com