గ్లోబల్ శాటిలైట్ కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు
- August 07, 2015
మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంకు అరుదైన గౌరవం దక్కనుంది. ఓ గ్లోబల్ శాటిలైట్ కు అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నారు. భూమి పరిశీలన, విపత్తుల నష్టాలను తగ్గించడం కోసం ఐక్యరాజ్యసమితి సహకారంతో రూపొందించే 'గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్ఆర్'కు కలాం పేరు పెట్టాలని ప్రతిపాదించారు. స్పేస్ టెక్నాలజీ ఫర్ సొసైటల్ అప్లికేషన్స్ సంస్ధ కెనడా-యూరప్-యూఎస్-ఆసియా (సీఏఎన్ఈయూఎస్) చైర్మన్ మిలింద్ పిమ్ ప్రికర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అబ్దుల్ కలాం గౌరవార్థం ఈ శాటిలై ట్ కు 'యూఎన్ కలాం గ్లోబల్ శాట్'గా పేరు మార్చాలని ప్రతిపాదించినట్టు పిమ్ ప్రికర్ చెప్పారు. జూలై 27న అబ్దుల్ కలాం షిల్లాంగ్ లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గ్లోబల్ శాటిలైట్ కు కలాం పేరు పెట్టడానికి ఐక్యరాజ్యసమితి సమావేశంలో అధికారికంగా ఆమోదించాల్సివుంది. సెప్టెంబర్ లో న్యూయార్క్ లో జరిగే ఈ కాన్ఫరెన్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 150కి పైగా దేశాధినేతలు హాజరవుతారు. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రపంచంలో విపత్తుల నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా 1999లో కెనడాలోని మాంట్రియల్ ప్రధాన కేంద్రంగా సీఏఎన్ఈయూఎస్ ను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









