ఇబ్రి: పోమిగ్రనేట్ సీజన్లో రైతులకు మంచి ఆదాయం
- September 17, 2016
ఒమన్‌లోని జబెల్ అల్ అక్దర్ మౌంటెన్స్ (ఇబ్రి ప్రావిన్స్ పరిధిలో) పోమిగ్రెనేట్స్ (దానిమ్మ) పంటకు అనుకూలమైన ప్రాంతం. ఈ రీజియన్‌లో ఇక్కడి నుంచే అనేక వెరైటీల దానిమ్మ పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈద్‌కి ముందు ఈ పండ్లను పెద్ద మొత్తంలో అమ్మకానికి ఉంచితే కేవలం రెండు గంటల్లోనే మొత్తం అమ్మకాలు పూర్తయిపోయాయి. గ్రేప్స్ మరియు పొమిగ్రెనేట్స్ ఫామ్ ఓనర్ మాట్లాడుతూ, మొత్తం పంటని 3,000 ఒమని రియాల్స్ (28,508 దిర్హామ్స్)కి విక్రయించినట్లు తెలిపారు. మరో ఫామ్ ఓనర్ 5,000 రియాల్స్ ఆర్జించారు. చెట్లను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుని, వాటి బాగోగుల్ని పట్టించుకుంటామని సలీమ్ అల్ హతాలి అనే ఫామ్ ఓనర్ చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి పోమిగ్రనేట్ సీజన్ ప్రారంభమై, అక్టోబర్ చివరి వరకు కొనసాగుతుంది. కొండల్లో చల్లని వాతావరణంలో ఇవి బాగా పండుతాయి. గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ప్లమ్స్, ఫిగ్స్, ఆల్మండ్స్, వాల్ నట్స్, పియర్స్ మరియు ఆప్రికోట్స్కి కూడా ఇక్కడ వాతావరనం అనుకూలంగా ఉంటుంది. 23,000కి పైగా పోమిగ్రనేట్ చెట్లు జబల్ అల్ అక్దర్ ప్రాంతంలోనే ఉంటాయని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫిషరీస్ అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తుంది. పంటల్లో ఎక్కువ భాగం యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి చోట్లకు ఎగుమతి అవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







