'అమ్మ' జయలలిత తాజాగా.. మరో పథకం..
- September 17, 2016
అమ్మ ఉప్పు, అమ్మ నీళ్లు, అమ్మ గ్రైండర్, అమ్మ లాప్టాప్, అమ్మ ఫోన్.. ఇలా నిత్యావసర వస్తువుల నుంచి గ్యాడ్జెట్లు, మందుల వరకు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత తాజాగా.. మరో పథకంతో ముందుకొచ్చారు. తక్కువ ఖర్చుతో వివాహ కార్యక్రమాలు జరుపుకొనేందుకు వీలుగా 'అమ్మ పెళ్లిమండపాల' పథకాన్ని ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న పెళ్లి మండపాలకు అద్దెలు ఎక్కువగా ఉండటంలో పేద ప్రజలపై అధిక భారం పడుతుందని.. వారికి సాయం చేసేందుకే ఈ పెళ్లిమండపాలను ప్రారంభిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.అందుబాటు ధరల్లో ఏసీ మేకప్ రూంలు, వరుడు, వధువుకు ప్రత్యేక గదులు, డైనింగ్ హాల్, కిచెన్ తదితర సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. రూ. 83కోట్లతో 11 ప్రాంతాల్లో ఈ మండపాలను ఏర్పాటుచేయనున్నారు. చెన్నైలో ఆరు, తిరువల్లూర్లో రెండు, మదురై, తిరునెల్వేలి, తిరుపూర్ జిల్లాలో ఒక్కోటి చొప్పున అమ్మ పెళ్లి మండపాలు నిర్మించనున్నారు
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







