'అమ్మ' జయలలిత తాజాగా.. మరో పథకం..

- September 17, 2016 , by Maagulf
'అమ్మ' జయలలిత తాజాగా.. మరో పథకం..

అమ్మ ఉప్పు, అమ్మ నీళ్లు, అమ్మ గ్రైండర్‌, అమ్మ లాప్‌టాప్‌, అమ్మ ఫోన్‌.. ఇలా నిత్యావసర వస్తువుల నుంచి గ్యాడ్జెట్లు, మందుల వరకు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి 'అమ్మ' జయలలిత తాజాగా.. మరో పథకంతో ముందుకొచ్చారు. తక్కువ ఖర్చుతో వివాహ కార్యక్రమాలు జరుపుకొనేందుకు వీలుగా 'అమ్మ పెళ్లిమండపాల' పథకాన్ని ప్రకటించారు.ప్రస్తుతం ఉన్న పెళ్లి మండపాలకు అద్దెలు ఎక్కువగా ఉండటంలో పేద ప్రజలపై అధిక భారం పడుతుందని.. వారికి సాయం చేసేందుకే ఈ పెళ్లిమండపాలను ప్రారంభిస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.అందుబాటు ధరల్లో ఏసీ మేకప్‌ రూంలు, వరుడు, వధువుకు ప్రత్యేక గదులు, డైనింగ్‌ హాల్‌, కిచెన్‌ తదితర సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. రూ. 83కోట్లతో 11 ప్రాంతాల్లో ఈ మండపాలను ఏర్పాటుచేయనున్నారు. చెన్నైలో ఆరు, తిరువల్లూర్‌లో రెండు, మదురై, తిరునెల్వేలి, తిరుపూర్‌ జిల్లాలో ఒక్కోటి చొప్పున అమ్మ పెళ్లి మండపాలు నిర్మించనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com