అనారోగ్య భారత టాక్సీ డ్రైవర్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు
- September 17, 2016
గత రెండు నెలలుగా అనారోగ్యంతో వెంటిలేటర్ మీద జీవన్మరణ పోరాటం చేస్తున్న అబూధాబీ ఆధారిత టాక్సీ డ్రైవర్ ఎలియాస్ జార్జ్ చివరకు శుక్రవారం రాత్రి తన ఇంటికి కేరళ కు క్షేమంగా చేరుకున్నారు. అతని సోదరుడు ఆస్టిన్ బృజ్ ఎయిర్ అంబులెన్స్ లో జార్జ్ తో కలిసి.అబూధాబీ బాటెన్ అధికారిక విమానాశ్రయం నుంచి భారతదేశంలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ప్రయాణించారు. మెదడు స్ట్రోక్ తో బాధపడిన జార్జ్, మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్ లో చేరిన విషయం " మా గల్ఫ్ డాట్ కామ్ " పాఠకులకు విదితమే. దేవుని దయ వలన మేము సురక్షితంగా ఆసుపత్రికి చేరుకున్నామని " జార్జ్ సోదరుడు ఆస్టిన్ బృజ్ కొచీ నుండి ఫోన్ చేసి చెప్పారు.
జార్జ్ భార్య మేరీ అంజు మరియు ఇద్దరు పిల్లలు ఆయన రాకతో ఎంతో ఉపశమనం పొందారు. ఈ కుటుంబం తమ కుటుంబ యజమాని రాక కోసం రెండు నెలల కాలంగా ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంది. జార్జ్ తండ్రి కే ఫిలోదాస్ ఖరీదైన ఎయిర్ అంబులెన్స్ ప్రయాణానికి సహాయం చేయమంటూ కేరళ రాష్ట్ర ప్రభుత్వ మరియు జాతీయ నాయకుల తలుపులని పదే పదే తట్టి వేడుకొన్నారు. ఆయన ప్రయత్నంకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ అంబులెన్స్ కోసం మొత్తం ఫీజు చెల్లించడానికి
ముందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. నా కుమారుడి ఆరోగ్య విషయంలో నేను అన్ని ఆశలు కోల్పోయాను. జార్జ్ ని కంటికి రెప్ప మాదిరిగా చూసుకొన్న (క్లీవ్‌ల్యాండ్ క్లినిక్) ఆస్పత్రి సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమకు అన్ని విధాలుగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహాయపడిన శ్రేయోభిలాషులకు, స్నేహితులు మరియు బంధువులకు ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నానని ," కొచీ ఫోర్ట్ నివాసి ఫిలోదాస్ చెప్పారు. మరి ముఖ్యంగా మా కలలు నిజం చేసి...మా కుమారుడి ఆరోగ్య విషయమై ఎంతో శ్రద్ధ తీసుకొని వార్తని ప్రచురితం చేసి... దేశ విదేశాలలో ఎందరి ద్వారానో సహాయం చేయడానికి మార్గ నిర్ధేశం చేసిన " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రత్యేక ధన్యవాదాలు ఫోన్ ద్వారా ఆయన తెలిపారు .
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







