అదుపు తప్పి రన్‌వేను దాటిపోయిన స్పైస్‌జెట్..
- September 17, 2016
హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన విమానం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్‌లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్‌వేను దాటి అర కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.నిర్ధేశిత రన్‌వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్‌పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు.విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్‌లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







