ఇరాన్ సైక్లిస్టు మృతి, పారాలింపిక్స్ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి ..
- September 18, 2016
రియో డి జెనీరోలో జరుగుతున్న పారాలింపిక్స్ రోడ్ రేస్‌లో ప్రమాదం చోటుచేసుకుని ఇరాన్‌కి చెందిన సైక్లిస్ట్ బాహ్మన్ గోల్బార్నిజాద్(48) మృతిచెందాడు. పురుషుల రోడ్ రేస్ సీ4-5 విభాగంలో బాహ్మన్ పాల్గొన్నాడు. సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని రియోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అతనికి గుండెపోటు వచ్చిందని ఇంటర్నేషనల్ పారాలింపిక్స్ కమిటీ(ఐపీసీ) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారాలింపిక్స్‌లో ఇలా ఒక అథ్లెట్ మరణించటం మొదటిసారని..ఇలా జరగటం చాలా బాధాకరమని అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయిన బాహ్మన్ 2002 నుంచి సైక్లింగ్‌లో పాల్గొంటున్నాడు. 2012 లండన్ పారాలింపిక్స్‌లో పాల్గొన్నాడు. సైక్లిస్టు మృతిపై ఇరాన్ పారాలింపిక్స్ కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.బాహ్మన్కు నివాళిగా రియో క్రీడాగ్రామంలో ఆ దేశ జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. ఆదివారం జరగబోయే ముగింపు వేడుకల్లో సంతాప సూచకంగా మౌనం పాటించనున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







