అక్టోబరు 7న ఆరు సినిమాలు విడుదల...
- September 18, 2016
పెద్ద పండుగ దసరా వస్తోంది. టాలీవుడ్ నుంచి సినిమాల జోరు పెరగనుంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా వరుసగా ఆరు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబరు 11న పండుగ అయినప్పటికీ సెలవుల సీజన్ అంతకు ముందే ప్రారంభమవుతుంది గనుక మేకర్స్ దీన్ని క్యాష్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. హాలిడే మూడ్‌ని తమ చిత్ర్రాల బిజినెస్‌కి అనుకూలంగా మార్చుకునే యోచనలో ఉన్నారు. ఈ ఆరు సినిమాల్లో అయిదు మీడియం బడ్జెట్ చిత్రాలు కాగా.. ఒకటి హై బడ్జెట్ మూవీ. నాగ చైతన్య 'ప్రేమమ్', కళ్యాణ్‌రామ్ 'ఇజం', తమన్నా నటించిన 'అభినేత్రి', మూవీలు అక్టోబరు 7న విడుదల కానున్నాయి.
ప్రకాష్ రాజ్ మూవీ 'మన ఊరి రామాయణం', సునీల్ నటించిన 'ఈడు గోల్డ్ ఎహె' కూడా అదే రోజున రిలీజ్ కాబోతున్నాయి.వీటిలో 'ప్రేమమ్', 'ఇజం', 'అభినేత్రి' చిత్రాల బడ్జెట్లు సుమారు ఇరవయ్యేసి కోట్ల చొప్పున కాగా.. 'మన ఊరి రామాయణం' కేవలం 3 కోట్ల బడ్జెట్ మూవీ. ఇక 'ఈడు గోల్డ్ ఎహె' చిత్రాన్ని 15 కోట్లతో తీశారట. అయితే.. కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ మొదటిసారి హీరోగా నటించిన 'జాగ్వార్' 75 కోట్ల భారీ బడ్జెట్ సినిమా. ఈ మూవీలన్నీ కలిపి దాదాపు 130 కోట్లకు పైగా బడ్జెట్‌తో తీసినవి. వీటిలో ఏది హిట్ అవుతుందో ఏది ఫట్ అవుతుందో ఆడియెన్సే డిసైడ్ చేస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







