"తాలింపు" రెస్టారెంట్ ఘ‌న‌మైన ఆఫర్..

- September 18, 2016 , by Maagulf

అచ్చ తెలుగుద‌నంతో అమీర్ పేట‌లో ఆవిష్కృత‌మైన "తాలింపు" రెస్టారెంట్ సెప్టెంబరు మూడో ఆదివారం (సెప్టెంబ‌రు 18) రోజున వైఫ్ అప్రిసియేష‌న్ డేను ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ప్ర‌తి ఏటా ఈ రోజును ప్ర‌పంచ వ్యాప్తంగా భార్య‌ను పొగిడే దినోత్స‌వంగా జరుపుకోవ‌డం ఆన‌వాయితీ. అయితే, ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని "తాలింపు" రెస్టారెంట్ ఘ‌న‌మైన ఆఫ‌రును ప్ర‌క‌టిస్తోంది. 
ఈ ఆఫ‌రులో పాల్గొనాలంటే భార్య‌ను పొగుడుతూ ఒక క‌విత రాయాల్సి ఉంటుంది. ఆ క‌విత నిడివి క‌నీసం ఆరు లైన్లు ఉండాలి. గ‌రిష్టంగా ఎన్నిలైన్ల‌యినా ఉండొచ్చు. మీరు రాసిన క‌విత‌ను తీసుకుని మీ జీవిత భాగ‌స్వామితో పాటు "తాలింపు" రెస్టారెంటుకు వ‌స్తే మీరు చేసే బిల్లుపైన ప‌ది శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అయితే ఒక ష‌రుతు ఏంటంటే... ఈ క‌విత‌ను మా రెస్టారెంటులో మీ భార్య‌కు చ‌దివి వినిపించాలి!. ఈ వేడుక ఈ ఆదివారం మాత్ర‌మే. భార్య‌ను సంతోష పెట్ట‌డానికి ఇంత‌కంటే మంచి సులువైన మార్గం ఏమైనా ఉంటుందా. భార్యామ‌ణులకు భ‌ర్త‌తో పొగిడించుకునే అద్భుత‌మైన అవ‌కాశాన్ని క‌ల్పించ‌డంతో పాటు ఈ వీకెండ్ మీ రెస్టారెంటు బిల్లును ప‌దిశాతం త‌గ్గించుకునే అవ‌కాశం కూడా క‌లుగుతుంది. మ‌రింకేంటి ఆల‌స్యం ఎక్కువ టైం లేదు. గెట్ రెడీ.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com