ఆరోగ్యంగానే ఉన్నా... వదంతులు నమ్మకండి: గౌండమణి
- September 18, 2016
తన ఆరోగ్యంపై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు గౌండమణి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. గౌండమణి ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని, కొనఊపిరితో కొట్టుమిట్టాడు తున్నారంటూ శనివారం ప్రసార మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. ఫేస్బుక్, వాట్సప్‌లలో పుకార్లు దావానలంలా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తనను కలుసుకున్న సీని పీఆర్ఓతో గౌండమణి మాట్లాడుతూ తాను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నానని, ఆస్పత్రిలో చికిత్సలు పొందలేదని స్పష్టం చేశారు. త్వరలో ఓ చిత్రంలో నటించేందుకు కథను వింటున్నానని, ఆ వివరాలను త్వరలో ప్రకటిస్తానని గౌండమణి తెలిపారు.తన ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని గౌండమణి తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







