యూజ్డ్ కార్స్‌లో 90 శాతం అక్రమాలే!
- September 18, 2016
మనామా: యూజ్డ్ కార్స్ (వాడేసిన కార్ల) కోసం వెళుతున్న వినియోగదారులు దారుణ మోసాలకు గురవుతున్నట్లు ఓ స్టడీలో వెల్లడయ్యింది. ఇన్‌స్పెక్టర్ ఆటోమోటివ్ సర్వీసెస్ ఫౌండర్, ఆటోమోటివ్ ఇంజనీర్ అహ్మద్ అల్‌సఫర్ నిర్వహించిన స్టడీలో, నూటికి 10 శాతం కార్లు మాత్రమే వినియోగదారులకు వీలుగా ఉంటున్నాయనీ, 90 శాతం కార్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తేలింది. ప్రమాదాలకు గురై, తీవ్రంగా పాడైన కార్లకు గ్రాండ్ లుక్ తీసుకొచ్చి, యూజ్డ్ కార్స్ పేరుతో అమ్మేస్తుండడం వల్ల కొద్ది రోజులకే ఆ కార్లు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నట్లు అల్ సఫర్ వెల్లడించారు. 300 యూజ్డ్ కార్స్‌ని తాము స్టడీ చేసి నివేదిక తయారు చేసినప్పటికీ, కొన్ని కారణాలతో ఆ నివేదికను బయటపెట్టలేకపోతున్నామనీ, అక్కడక్కడా యూజ్డ్ కార్స్‌ని డిస్‌ప్లే పెట్టి నిర్వాహకులు అక్రమంగా అమ్మేస్తున్నారని ఆయన వివరించారు. అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని, వినియోగదారులకు అండగా ఉండాలని అల్ సఫర్ విజ్ఞప్తి చేశారు. సెకెండ్ హ్యాండ్ కారు వినియోగదారులూ యూజ్డ్ కార్స్ కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









