దుబాయ్‌ కార్పొరేషన్‌ చట్టాన్ని జారీ చేసిన మొహమ్మద్‌

- September 18, 2016 , by Maagulf
దుబాయ్‌ కార్పొరేషన్‌ చట్టాన్ని జారీ చేసిన మొహమ్మద్‌

దుబాయ్‌: దుబాయ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఇకపై దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌గా మారింది. వైస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ది యూఏఏఈ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఈ మేరకు కొత్త చట్టాన్ని జారీ చేశారు. దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ 100 మిలియన్‌ దిర్హామ్‌ల మూలధనాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఇంకా పెంచేందుకు రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) బోర్డ్‌ అండ్‌ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ట్యాక్సీ మరియు స్పెషలైజ్డ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసుల్ని యూఏఈ మరియు విదేశాల్లో విస్తరించేందుకు దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ని తీర్చిదిద్దనున్నారు. ప్రైవేటు సెక్టార్‌తో కలిసి ప్రయాణీకులకు మరింత వీలుగా రవాణా సౌకర్యాల్ని కల్పిస్తారు. అలాగే పెట్టుబడులు రాబట్టేందుకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిజైనింగ్‌, ఎస్టాబ్లిషింగ్‌, మేనేజింగ్‌, ఆపరేటింగ్‌, మెయిన్‌టెయినింగ్‌ వంటి విభాగాల్లో రీసెర్చ్‌ అండ్‌ స్టడీ నిర్వహించి, సరికొత్త రవాణా వ్యవస్థను తీర్చిదిద్దుతారు. అలాగే దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన& సొంతంగా పెట్రోల్‌ స్టేషన్లను కూడా తమ వాహనాల కోసం న్విహిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com