లింగ నిర్ధారణ సమాచారమిక ఆన్లైన్లో ఉండబోదు..
- September 19, 2016
ఇకపై లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారం, ప్రకటనలు సెర్చ్ ఇంజిన్లలో ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. సదరు సెర్చ్ ఇంజిన్లు త్వరలోనే వీటిని నిలిపివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అసలేం జరిగిందంటే..గూగుల్, మైక్రోసాఫ్ట్, యాహూలాంటి ప్రముఖ సెర్చ్ ఇంజిన్లు లింగ నిర్ధారణకు సంబంధించిన సమాచారాన్ని, ప్రకటనలను అందిస్తున్నాయని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. గర్భంలో ఉన్న బిడ్డ ఆడో, మగో తెలుసుకునేందుకు చేసే లింగ నిర్ధారణ పరీక్షల ప్రకటనలే గాక, ఆ క్లినిక్స్కు సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాయని సాబు మాథ్యూ జార్జ్ అనే వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.దీనిపై గత జులైలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ ప్రకటనలు పూర్తిగా ఆగిపోయేలా చేయలేరా అంటూ సెర్చ్ఇంజిన్లను ప్రశ్నించింది. అంతేగాక, వీటిని ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది.దీంతో సదరు సెర్చ్ ఇంజిన్ కంపెనీలతో చర్చించిన కేంద్రం.. త్వరలోనే ప్రకటనలు ఆగిపోనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఓ ప్రత్యేక ఆటోబ్లాక్ సిస్టమ్ను ఏర్పాటుచేసినట్లు పేర్కొంది. లింగ నిర్ధారణ సమాచారం కోసం వెతికే 22 సంబంధిత పదాలను(కీ వర్డ్స్) గుర్తించామని, ఈ ఆటోబ్లాక్ సిస్టమ్ ద్వారా ఆ పదాలతో వెతికితే యూజర్లకు ఎలాంటి సమాచారం రాదని కంపెనీలు తెలిపాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







