తళుకు తారల అంబరం,నింగినంటే సంబరం:దుబాయ్ 'సైమా అవార్డుల' కార్యక్రమం
- August 08, 2015
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వారు ఈ సంవత్సరం దుబాయిలో నిర్వహించిన అవార్డుల ఉత్సవం ఆకాశంలో నక్షత్రాలనే చిన్నబోయేట్టు చేసింది. దీనిలో 2014 సంవత్సరానికిగాను గురువారం తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన వారికి అవార్డులు అందించారు.శుక్రవారం తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టులకు ఆయా రంగాలలో అవార్డులు అందించారు. ప్రముఖ తెలుగు నిర్మాత రమానాయుడు జ్ఞాపకార్ధం అల్లు ఆరవింద్, భారతీరాజా, సుహాసిని చేతుల మీదుగా, ఆయన కుటుంబ సభ్యులు వెంకటేష్, రాణా, నగఛైతన్యలు జ్ఞాపికను స్వీకరించారు. ప్రముఖ పాప్ గాయని ఉష ఉత్తుప్ గానం, బాలకృష్ణ, వెంకటేష్, ఖుష్బూ, శ్రుతి హసన్ ల చిందులు వీక్షకులను హుషారెత్తించాయి. బాలకృష్ణ, రాశీ ఖన్నా, చంద్రబోస్, పీటర్ హెఇన్స్, శ్రియ, సుహాసిని, బ్రహ్మానందం, శ్రుతి హసన్ పురస్కారాలందుకున్న వారిలో ప్రముఖులు. భారతీయ సినీ అందాల రాణులు - ప్రణీత, పూజా హెగ్డే, అదా శర్మ, శ్రియ, అమల పాల్ తమ నృత్యాలతో రంగస్థలాన్ని జిగెల్మనిపించారు.
--సి.శ్రీ(దుబాయ్)


తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







