నో స్కూల్ బ్యాగ్స్ - నో హోమ్ వర్క్: సిబిఎస్ఇ
- September 20, 2016
ఇండియాకి చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్, ఓ సర్కులర్లో ఒమన్‌లోని స్కూళ్ళకు స్కూలు విద్యార్థుల పుస్తకాలు, బ్యాగ్‌లు, హోమ్ వర్క్‌పై సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థులు స్కూల్ బ్యాగ్‌లను తీసుకువెళ్ళరాదనీ, వారికి ఎలాంటి హోమ్ వర్క్ ఇవ్వరాదని పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ విల్సన్ వి జార్జ్, సిబిఎస్ఇ ఆదేశాలను ఆచరణలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. సర్క్యులర్‌లో చాలా రికమండేషన్స్ ఉన్నాయని ఆయన వివరించారు. ఒమన్‌లో మొత్తం 19 ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో 1 నుంచి 2వ తరగతి చుదువున్న విద్యార్థుల సంఖ్య 9,000 వరకూ ఉంటుంది. అలాగే, స్కూళ్ళు విద్యార్థులపై భారం మోపకుండా ఉండాలనీ, 1 నుంచి 8 తరగతుల వరకు తక్కువ బరువుతో కూడిన బ్యాగేజ్ మాత్రమే ఉండేలా పుస్తకాల సంఖ్యను తగ్గించాలని సర్కులర్ చెబుతోంది. ఎదిగే వయసులో పిల్లల వెన్ను భాగంపై పుస్తకాల బ్యాగ్‌ల కారణంగా ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంటోంది. భవిష్యత్తులో వారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ కారణంగా బ్యాగ్‌ల బరువు తగ్గింపుపై సిబిఎస్ఇ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







