60శాతం ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు
- September 20, 2016
జెడ్డా: జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కమిటీ, 60 శాతం స్కూల్స్, వార్షిక ఫీజుల్ని పెంచేందుకు సన్నద్ధమవుతున్నట్లు అంచనా వేసింది. 25 శాతం నిర్వహణ ఖర్చులు పెరగడంతో స్కూళ్ళు ఫీజుల పెంపు నిర్ణయం తీసుకోనున్నాయని తెలియవస్తోంది. కమిటీ హెడ్, నేషనల్ కమిటీ - సౌదీ చాంబర్ మాలెక్ తలెబ్ ఈ విషయంపై మాట్లాడుతూ, మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ కన్నా ఫీజుల పెంపు నిర్ణయాన్ని స్కూళ్ళకే వదిలేయడం మంచిదనీ, ఈ నిర్ణయం ద్వారా స్కూళ్ళు, ఇంకా మెరుగైన సౌకర్యాల్ని విద్యార్థులకు కల్గించేందుకు ఆస్కారముంటుందని అభిప్రాయపడ్డారు. టీచర్లను హైర్ చేసుకోవడం, అలాగే టీచర్‌తోపాటు డిపెండెంట్స్‌కి కూడా ఇన్స్యూరెన్స్ చెల్లించడం వంటివాటి వల్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాంతో, పీజుల పెంపు తప్ప ఇంకో మార్గం కనిపించడంలేదు. ఇంకో వైపున నేషనల్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మెంబర్ దకీల్ అల్లా అల్ జోహాని ఈ విషయంపై మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేటు స్కూళ్ళకు చాలా తక్కువగా మాత్రమే సహాయం అందిస్తోందనీ, ఒక స్టూడెంట్‌కి ఏడాదికి 100 సౌదీ రియాల్స్ మాత్రమే ప్రభుత్వం నుంచి దక్కుతోందని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







