శలాలహ్ భారతీయ సోషల్ క్లబ్ హార్థిక సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి

- September 21, 2016 , by Maagulf
శలాలహ్ భారతీయ సోషల్ క్లబ్ హార్థిక సమావేశంలో పాల్గొన్న భారత రాయబారి

       మస్కట్ - ఒమాన్ లో  భారతదేశ రాయబారి ఇంద్ర మణి పాండే శలాలః పర్యటనలో  భారత సంఘ క్లబ్  నిర్వహించిన ఒక హార్థిక సమావేశంలో ఈద్ అల్ అధా, ఓనం, దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నారు.ఈ వేడుక క్లబ్ అతని మెజెస్టి సుల్తాన్ కబూస్ బహుళార్ధక మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా 10 వ  తరగతి  మరియు ఇంటర్మీడియేట్  సి బి ఎస్ సి పరీక్షలలో రాణించిన క్లబ్ సభ్యులు విద్యార్థులని  సత్కరించారు.చైర్మన్ మన్ప్రీత్ సింగ్  గౌరవనీయ హెచ్ ఇ పాండేని ఘనంగా స్వాగతించారు. అతను శలాలః ఇండియన్ కమ్యూనిటీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆహ్వానించబడ్డారు. భారతీయులు ఎక్కడ ఉన్నా ఒకటేనని విదేశాలలో ఉన్నా...ఐక్యంగా  ప్రజలు ఒక సమాజంగా ఏర్పడి  ఈ పండుగలు జరుపుకునే విధానం ఒక మంచి సంస్కృతి అని అన్నారు. ఇటీవల  పదవ తరగతి పరీక్షలలో మరియు పన్నెండవ తరగతులలో విశేష   ప్రతిభని చూపిన  విద్యార్థులను ఆయన అభినందించి సత్కరించారు. రాయబారి పాండేకు మన్ప్రీత్ సింగ్  పూలగుత్తి మరియు జ్ఞాప్తికను అందించారు. హరిద్య  మీనన్, లేడీ కోఆర్డినేటర్ శుష్మ పాండే రాయబారి భార్యకు పూలగుత్తి సమర్పించారు.లాయర్ మహ్మద్ అల్ బాదామి దౌత్యవేత్తకు  జ్ఞాపకని సమర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com