మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసిన బంగ్లాదేశ్ వ్యక్తికి జీవిత ఖైదు

- September 21, 2016 , by Maagulf
మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేసిన బంగ్లాదేశ్ వ్యక్తికి జీవిత ఖైదు

మనామా : ఒక బంగ్లాదేశీ వ్యక్తి మోటార్ బైక్ విడి భాగాలలో మారిజోనా మాదక ద్రవ్య మాత్రలు దాచి రాజ్యంలోనికి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణ కేసులో యావజ్జీవ శిక్షతో పాటు 5,000 బి డి జరిమానా దేశ బహిష్కరణ విధించబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోటారుబైకుల విడి భాగాలలో మాదక ద్రవ్యాల ప్యాకేజీలను ఉంచి  దేశం వెలుపలకు వచ్చి విక్రయిస్తుంటాడని తెలుసుకొన్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 30,000 బి డి విలువ కలిగిన మూడు కిలోగ్రాముల బరువు గల గంజాయి 505 మాత్రల  ప్యాకేజీని నిందితుని నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ముద్దాయి దేశంలో మాదక ద్రవ్యాలను  అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు న్యాయవాదులు కోర్టుకి తెలిపారు. ఈ నేరానికి ముద్దాయికి 25 సంవత్సరాల జైలుశిక్షతో పాటు  శిక్ష పూర్తి చేసిన తర్వాత బహరేన్ నుండి దేశమునుండి పంపించేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com