రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్‌డీవో బాలాసోర్..
- September 21, 2016
రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్‌డీవోబాలాసోర్: ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష బుధవారం రెండోరోజునా విజయవంతమైంది. భారత, ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారుచేసిన ఈ క్షిపణులు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి. డీఆర్‌డీవో తొలుత మంగళవారం ఒడిసాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించింది.రెండోరోజు భిన్నమైన ఎత్తు, దూరాల లక్ష్యంతో పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్, ముప్పును గుర్తించి హెచ్చరించే రాడార్‌లను కూడా అమర్చారు. దీంతో శత్రుదేశాల వైమానిక, క్షిపణి దాడులను ముందే పసిగట్టి అడ్డుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







