భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ పాకిస్థాన్ కు సమన్లు..
- September 22, 2016
పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ కు భారత విదేశాంగ కార్యదర్శి జై శంకర్ సమన్లు జారీ చేశారు. భారత్ కు వ్యతిరేకంగా పాక్ భూభాగంలో సాగుతున్న చర్యలను వెంటనే ఆపాలని ఆయన పాక్ ను డిమాండ్ చేశారు. పాకిస్థాన్ హైకమిషనర్ ను ప్రధాన మంత్రి నివాసానికి ఆహ్వానించి ఆయనతో చర్చలు జరిపారు. ఆ సమావేశానికి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, నితిన్ గడ్కారీ లు హాజరయ్యారు.ఉరి ఘటనలో ఉగ్రవాదులు ఉపయోగించిన గన్ లు, గ్రెనేడ్లు, ఇతర ఆయుధాలపై పాకిస్థాన్ గుర్తులున్నాయని, వాటి ఆధారాలను బాసిత్ కు అందించారు. ఈ విషయాన్ని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు బాసిత్ కు తెలిపారు.పాకిస్థాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని భారత్ పాక్ కు స్పష్టం చేసిందని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







