తదుపరి చిత్రంకు రెడీ అవుతున్న నిఖిల్..

- September 22, 2016 , by Maagulf
తదుపరి చిత్రంకు రెడీ అవుతున్న నిఖిల్..

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ జాగ్వార్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని దసరా కానుకగా ముందుకు రానుంది జాగ్వార్ చిత్రం. ఈ చిత్రం రిలీజ్ కాకముందే కుమార స్వామి తన కొడుకు తదుపరి చిత్రంపై అప్పుడే ఆలోచనలు చేస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ నిఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేస్తారని జాగ్వార్ ఆడియో రిలీజ్ సందర్భంగా కుమార్ స్వామి ప్రకటించారు. అయితే ఈ లిస్టులో పూరి జగన్నాథ్‌, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. కొడుకు కోసం ఎక్కడా రాజీపడట్లేదు కుమారస్వామి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com