మిస్టర్ ఇండియా-2 రాబోతోంది..!
- September 22, 2016
బాలీవుడ్లో 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా చిత్రం ఇప్పటికీ ఎవర్గ్రీన్ చిత్రమే. అనిల్ కపూర్, శ్రీదేవి, 'మొగాంబో' అమ్రీశ్ పురిలు నటించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో అనిల్ కపూర్, శ్రీదేవి కలిసి ఆడిపాడిన 'ఐ లవ్యూ..' పాట ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మెదులుతూనే ఉంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా మిస్టర్ ఇండియా-2 రాబోతోంది. ఇందులోనూ అతిలోక సుందరి శ్రీదేవే నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం ఇప్పటినుంచే శ్రీదేవి ఈ సినిమాకి కావాల్సిన దుస్తులన్నీ డిజైన్ చేయించుకుంటోందని సన్నిహితులు తెలిపారు.సీక్వెల్ విషయమై బోనీ గతేడాదే వెల్లడించారు. మిస్టర్ ఇండియాకి సీక్వెల్ తీయాలనుకుంటున్నామని కానీ శేఖర్ కపూర్ మాత్రం సీక్వెల్‌ని డైరెక్ట్ చేయరని చక్కటి స్టోరీ కుదిరిన వెంటనే సినిమా ప్రారంభిస్తామని బోనీ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీదేవి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖితో కలిసి నటిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







