సంగీతాభిమానుల్ని అలరిస్తున్న 'మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ'
- September 22, 2016
జయ నరసింహారావు నేతృత్వంలో గత కొన్నేళ్ళుగా సంగీతాభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ (ఎంఎల్ఎఫ్). మొహమ్మద్ రఫీకి మెహ్ఫిల్, కిషోర్ కి ఖజానా పేరుతో అలనాటి మేటి పాటలతో పలు కార్యక్రమాల్ని నిర్వహించిన ఎంఎల్ఎఫ్, ఈ నవంబర్‌లో మరో మ్యూజిక్ ఈవెంట్‌ని నిర్వహించనుంది. ఈ నవంబర్‌లో దుబాయ్‌లో మ్యూజిక్ లవర్స్‌ని అలరించేందుకు ఎంఎల్ఎఫ్ సమాయత్తమవుతోంది. ఉత్తరాది సినీ పాటలే కాకుండా, దక్షిణాది సినీ పాటలతోనూ పలు ఈవెంట్స్‌ని గతంలో ఈ ఎంఎల్ఎఫ్ నిర్వహించింది. సినీ పాటల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రాజన్ నాగేంద్రను తొలిసారిగా యూఏఈకి తీసుకువచ్చిన ఘనత ఎంఎల్ఎఫ్కే చెందుతుంది. గోల్డెన్ మెలోడీ క్లాసిక్స్ అనదగ్గ పాటల్ని ఎంపిక చేసుకుని, అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకుని, సినీ సంగీతాభిమానుల్ని అలరించడంతో అతి తక్కువ కాలంలోనే ఎంఎల్ఎఫ్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోగలిగింది. లెజెండరీ సింగర్ ముఖేష్‌ని జ్ఞప్తికి తెచ్చేలా సప్నే సప్రిలె సప్నే పేరుతో ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై భారతీయ సినీ సంగీత రంగానికి చెందిన లెజెండ్స్‌కి గ్రేట్ ట్రిబ్యూట్ ఇస్తున్నట్లు ఎంఎల్ఎఫ్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







