రివ్యూ :మజ్ను

- September 23, 2016 , by Maagulf
రివ్యూ :మజ్ను

నటీనటులు: నాని, అనూ ఇమ్మానుయేల్‌, ప్రియా శ్రీ
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌
మాటలు: మిర్చి కిరణ్‌
సంగీతం: గోపీ సుందర్‌
నిర్మాతలు: గీత , పి.కిరణ్‌
దర్శకత్వం: విరించి వర్మ
విడుదలః 23 సెప్టెంబర్‌, 2016
ఇప్పటికే నాలుగు వరుస హిట్లతో ఉన్న యంగ్ హీరో నాని జోరుమీదున్నాడు. ఉయ్యాల జంపాలతో మెప్పించిన దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం మజ్ను. మరి అయిదో హిట్ ను తన ఖాతాలో నాని వేసుకున్నాడా.. విరించి వర్మకు మరో విజయం దక్కిందా.. అంతే ఈ సమీక్ష చదవాల్సిందే.
కథః
ఆదిత్య (నాని) ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వద్ద బాహుబలి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు.
ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనేది అతడి కల. అందుకే తన లవ్ స్టోరినే కథగా రాసుకుంటుంటాడు. ఇక ఇతగాడు తొలి చూపులోనే సుమ(ప్రియా శ్రీ)ని లవ్ చేసేస్తాడు. అయితే తాను ఇంతకు ముందు లెక్చరర్ గా పని చేస్తున్న భీమవరంలో ఒకమ్మాయిని ప్రేమించానని, అది బ్రేకప్ అయిందని సుమకు చెబుతాడు.. దీంతో ఆదిత్య నిజాయితీ నచ్చిన సుమ అతడిని ప్రేమిస్తుంది. ఇంతలో ఆదిత్య ఓల్డ్ లవర్ కిరణ్ (అను ఇమ్మానుయేల్) ఆదిత్య లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరి ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఇక ఆదిత్య ఇద్దరి ప్రేయసీలను ఎలా ఇబ్బంది పడ్డాడు. చివరికి ఎవరికి ఒకే చెప్పాడు. ఇంతకీ డైరెక్టర్ అయ్యాడా అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
నటినటులుః
లవ్వర్ బోయ్ గా, ప్రేమికుల మధ్య నలిగిపోయే వ్యక్తిగా నాని బాగానే నటించాడు.నాని మరోసారి చాలా నేచురల్‌గా నటించి తనకున్న నేచురల్ స్టార్ బిరుదు సార్థకం చేసుకున్నాడు. క్యామెడీ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు.. హారోయిన్స్ ఇద్దరూ పోటీ పడి నటించారు.. అయితే ఈ ఇద్దరిలో అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రలో ఇమిడిపోయింది..నాని సినిమాల్లో కనిపించే కామెడీ ఈ సినిమాలో పెద్దగా కనిపించదు. కానీ.. నాని- వెన్నెలకిషోర్‌ ఎపిసోడ్‌ ఇందుకు మినహాయింపు. సప్తగిరి.. సత్యలాంటి కమెడియన్లతో మరింత నవ్వించాల్సింది.
సాంకేతిక వర్గం
కథ పాతదే..అయితే దర్శకుడు విరించి వర్మ దానిని తెరమీద ప్రజెంట్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో ప్రెష్ లవ్‌స్టోరీని చాలా నేచురల్‌గా తెరకెక్కించాడు. ఇక సెకండాఫ్‌లో వచ్చే కామెడీ టైమింగ్ పంచ్ లు అదిరాయి. లవ్ మూవ్లీ ఉండాల్సిన స్పీడ్ ఈ మూవీలో కనిపించదు.. సెకండాఫ్ అయితే సాగదీసినట్లు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ప్లాష్‌బ్యాక్‌లో భాగంగా వచ్చే లవ్‌స్టోరీ చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. . ఫస్టాఫ్‌ను దర్శకుడు ఎంత అందంగా చేశాడో సెకండాఫ్ అంత రొటీన్ చేసేశాడు. కామెడీ తప్ప కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక ఓ అమ్మాయిని ప్రేమిస్తూ కూడా మళ్లీ పాత అమ్మాయితోనే ప్రేమలో ఉన్నానేమోనని హీరో రియలైజ్ అవ్వడం, మళ్లీ క్లైమాక్స్‌లో సడెన్‌గా హీరోయిన్ మారిపోవడం ఈ మూవీకి మైనస్‌గా మారాయి. సెకండాఫ్ పై దర్శకుడు సరిగా దృష్టి పెట్టి ఉంటే మంచి లవ్ స్టోరీ ఫీల్ ఉండేది.. దర్శకుడు ఈ విషయంలో తప్పటడుగు వేశాడు. గోపీ సుందర్‌ సంగీతం బాగుంది. జ్ఞానశేఖర్‌ కెమేరా.. అశోక్‌ కళ చక్కటి అందాల్ని చూపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.. యూత్ ఒకసారి ఈ మూవీపై లుక్కేయవచ్చు.
కామెంట్ః మజ్ను - తూలిపడ్డాడు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com