యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం...
- September 26, 2016
ఉగ్రవాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు స్పందనతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాటిని తిప్పికొట్టేందుకు పాక్ దౌత్యవేత్తలు తలమునకలవుతున్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్తాన్‌ను ఒంటరి చేయాలనుకుంటున్న భారత్ కల ఎప్పటికీ నెరవేరదని పాక్ దౌత్యవేత్త ఒకరు అన్నారు. భారత్ యుద్ధానికి దిగదని, యుద్ధమంటూ జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయం వారికి బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. ఈ కథనాన్ని దౌత్యవేత్త పేరు ప్రస్తావించకుండా 'డాన్' పత్రిక ప్రచురించింది. 'యుద్ధం ఉండకపోవచ్చు. మేము యుద్ధం మొదలుపెట్టాలని అనుకోవడం లేదు. ఈ దశలో యుద్ధం అంటూ జరిగేతే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం.అందుకే భారత్ కూడా యుద్ధాన్ని ఎంచుకోదు' అని పాక్ దౌత్యవేత్త అభిప్రాయపడినట్టు ఆ కథనం పేర్కొంది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







