స్కూల్ బస్ ఫీజులపై పేరెంట్స్ ఫిర్యాదు
- September 26, 2016
జెడ్డా: జెడ్డాలో స్కూల్ బస్ ఫీజుల్ని 21.4 శాతం మేర పెంచారు. ఒక్కో విద్యార్థికీ 700 సౌదీ రియాల్స్ నుంచి 850 సౌదీ రియాల్స్ వరకూ ఫీజులు పెరిగాయి. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో ఈ ఫీజుల పెంపు విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా మారింది. అయితే వాహన ఇన్స్యూరెన్స్, ఉద్యోగుల జీతాలు వంటివాటి దృష్ట్యా ఫీజుల్ని పెంచాల్సి వచ్చిందని ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ అబ్దుల్ రహమాన్ అల్ మోట్లాగ్ చెప్పారు. మరో ట్రాన్స్పోర్ట్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ జహ్రి మాట్లాడుతూ, 15 నుంచి 20 శాతం మేర ఫీజులు పరిగినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాల కారణంగానే ఈ పెరుగుదల తప్పడంలేదని ఆయన వివరించారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పెరిగిన స్కూల్ బస్ ఫీజుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తక్కువ ఫీజులతోనే తగిన ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







