'ప్రవాస స్త్రీశక్తి' అవార్డుకు ఎంపికయిన ఉపాసన
- September 26, 2016
అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రవాసి మిత్ర మాస పత్రిక సంయుక్తంగా ప్రవాసి బతుకమ్మ అవార్డును ప్రకటించగా యూఏఈలోని గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్‌లో సభ్యురాలైన ఉపసన రాబర్ట్ ఎంపికైనట్లు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఉపసన గత కొన్నేళ్ల క్రితం యూఏఈ దేశంలో స్థిరపడి దుబాయిలో ఉద్యోగం చెస్తు గల్ఫ్ సంక్షేమ సంఘంలో కీలకపాత్ర పోషిస్తూ సామాజిక సేవలో పాల్గొంటూ పలు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను స్త్రీశక్తి అవార్డుకు ఎంపికైంది. అక్టోబర్ 2న హైదరాబాధ్‌లోని ప్రవాసి బతుకమ్మ సందర్భంగా ఇచ్చే అవార్డుల్లో భాగంగా బేగంపేటలోని జీవనజ్యోతి క్యాంపు ఆఫీసులో డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
ఈ సందర్భంగా ఉపాసనను గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధులు జువ్వాడి శ్రీనివాసరావు, రాజాశ్రీనివాస్, శ్రీనివాస్‌శర్మ, సదానంద్,నరేందర్ రెడ్డి, సలావుద్దీన్,రమేష్ చంద్ర, కిరణ్ ,శామ్యూల్ తదితరులు అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







