టూరిజం ప్లాన్: ఉచిత వీసాలో కొత్త సవరణ
- September 27, 2016
ఖతార్: ఖతార్ టూరిజం అథారిటీ (క్యుటిఎ), ఖతార్ ఎయిర్ వేస్ (క్యుఎ), ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ) సంయుక్తంగా కొత్త టూరిజం ప్లాన్‌ని అనౌన్స్ చేశాయి పర్యాటకులను ఆకర్షించేందుకోసం. ఈ కొత్త ప్లాన్ ప్రకారం కొత్త ష్ట్రట్రాన్సిట్ వీసా స్ట్రక్చర్‌ని తెరపైకి తీసుకొచ్చారు. హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (హెచ్‌ఐఏ)లో మినిమమ్ 5 గంల ట్రాన్సిట్ టైమ్‌ని కేటాయిస్తారు. అలాగే, ఖతార్‌లో 96 గంటలపాటు (అంటే నాలుగు రోజులపాటు) స్టే చెయ్యడానికి ఉచితంగా వీసా సౌకర్యాన్ని కల్పిస్తారు. గతంలో ఈ విధానంలో కేవలం 48 గంటల సమయం (అంటే రెండు రోజులపాటు) మాత్రమే అవకాశం ఉండేది. కొత్త విధానం ద్వారా ఖతార్‌లో పర్యటించాలనుకునేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనీ, ఖతార్ టూరిజంకి ఇది ఎంతో బూస్టప్ ఇస్తుందని టూరిజం వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఖతార్‌ని పర్యాటక కేంద్రంగా మలచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు క్యుటిఎ చీఫ్ టూరిజం డెవలప్‌మెంట్ ఆఫీసర్ హసన్ అల్ ఇబ్రహీమ్ చెప్పారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







